12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (2024)

హోమ్ /ఛాయాచిత్రాల ప్రదర్శన /కాలజ్ఞానం /12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి?

12 Zodiac Signs: మనుషులంతా ఒకేలా ఉండరు. ఐతే… రాశుల ఆధారంగా ఎవరు ఎలా ఉంటారో జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

  • 4-MIN READ| News18 Telugu

    Last Updated :

  • Published ByKrishna Kumar N

01

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (2)

12 Zodiac Signs: రాశిఫలాలనే సూర్యఫలాలు అని కూడా అంటారు. అంటే… మనం పుట్టినప్పుడు సూర్యుడు ఏ స్థానంలో (ఎక్కడ) ఉన్నాడన్నదాన్ని బట్టీ… మన రాశి ఏది అన్నది గుర్తిస్తారు. తద్వారా ఒక్కో రాశిలో పుట్టిన వారికి ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అలాగే బలాలు, బలహీనతలు కూడా ఉంటాయని అంటున్నారు. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే… బలాలను ఉపయోగించుకొని… బలహీనతలను తగ్గించుకొని… విజయాలు సాధించవచ్చు అని చెబుతున్నారు. మరి ఏ రాశి వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో, ఎలా బలాలు పెంచుకోవాలో, ఎలా పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలో తెలుసుకుందాం.

ప్రకటనలు

02

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (3)

మేష రాశి (Aries): మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 మధ్య పుట్టినవారికి… మేష రాశి ఉంటుంది. ఈ కాలంలో సూర్యుడు ఈ రాశి గుండా ప్రయాణిస్తాడు. మేష రాశిని ఫైర్ సైన్ అంటారు. అంటే ఈ రాశి ఎప్పుడూ అగ్నిలాగా చెలరేగుతూ నిప్పు కణికలా భగభగలాడుతూ ఉంటుంది. అంటే… దానర్థం చాలా చెలాకీగా, చురుకుగా, చైతన్యవంతంగా ఉంటుంది అని. ఈ రాశి ఉన్నవారు దూసుకుపోతారు. ముందుండి నడిపిస్తారు. వీరు ఒంటరిగానే విజయాలు సాధిస్తారు. ఒంటరిగానే ఏదైనా చేస్తుంటారు. అవకాశాల్ని బాగా ఉపయోగించుకుంటారు. ఐతే… వీరికి క్రమశిక్షణ కాస్త తక్కువగా ఉంటుంది. దాన్ని మెరుగుపరచుకుంటూ వెళ్తే… జీవితంలో ఎన్నో సాధించగలరు.

ప్రకటనలు

03

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (4)

వృషభ రాశి (Taurus): ఏప్రిల్ 20 నుంచి మే 20 మధ్య సూర్యుడు ఈ రాశి నుంచి వెళ్తాడు. ఈ రాశి చిహ్నం ఎద్దు. ఇది భూమికి చెందిన రాశిగా భావిస్తారు. ఈ రాశికి చెందిన వారు తాము అనుకున్నది చెయ్యడానికి బాగా కష్టపడి పనిచేస్తారు. సంప్రదాయాల్ని కాపాడతారు. నమ్మదగిన వారిగా ఉంటారు. సమాజాన్ని తీర్చిదిద్దుతారు. రోజువారీ పనులు బాగా చేసుకుంటారు. కావాల్సిన వారిని బాగా చూసుకుంటారు. వారికి ఏం కావాలో వారికి తెలుసు. అలాగే ఇతరులకు ఏం కావాలో కూడా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. వీరు మార్పులను ఇష్టపడరు. అది వీరి మైనస్ పాయింట్. ఈ విషయంలో మార్పులు చేసుకుంటే… వీరికి తిరుగుండదు.

04

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (5)

మిథున రాశి (Gemini): మే 21, జూన్ 20 మధ్య సూర్యుడు మిధున రాశి నుంచి ప్రయాణిస్తాడు. రోమన్ సంఖ్యలో 2కు ఈ మిథున రాశి చిహ్నమే ఉంటుంది. ఈ రాశికి అర్థం రెండు అని. అంటే కవలలు. అందువల్ల ఈ రాశి కలిగిన వారిలో ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు ఉంటాయి అంటారు. ఇది ఈ రాశి వారికి ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్ కూడా. ఈ రాశి వారు చాలా తెలివైన వారు, చురుగ్గా ఉంటారు, చాలా స్కిల్స్ ఉంటాయి. బాగా మాట్లాడగలరు. కొత్త విషయాలు బాగా నేర్చుకుంటారు. ఐడియాలు బాగా వస్తాయి. ఇతరులతో బాగా కలుస్తారు. మరి సమస్య ఏంటంటే… దేనిపైనా పూర్తిగా ఫోకస్ చెయ్యలేరు. ఏ నిర్ణయంపైనా ఫిక్స్‌గా ఉండలేరు. దీనిపై ఫోకస్ పెంచుకోవాలి.

ప్రకటనలు

05

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (6)

కర్కాటక రాశి (Cancer): జూన్ 21 నుంచి జులై 22 మధ్య సూర్యుడు ఈ రాశి గుండా వెళ్తాడు. ఈ రాశి చిహ్నం ఎండ్రకాయ. పీత అంటారే అది. పీత నీటి దగ్గర జీవిస్తుంది కదా… అందువల్ల ఇది నీటి రాశి. హెవీ సెంటిమెంట్ రాశి. ఎమోషన్లు బాగా ఉంటాయి. ఇతరుల పట్ల చాలా కేర్‌తో ఉండారు. కష్టాల్లో ఉన్న వారికి తోడుగా ఉంటారు. ఫ్యామిలీ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, చుట్టాలతో రిలేషన్స్, ఫ్రెండ్స్‌తో సంబంధాలు అన్నింట్లోనూ మంచి బాండ్ కలిగి ఉంటారు. ఐతే… వీళ్లు ఎమెషన్‌ను కంట్రోల్ చేసుకోలేరు. మరీ ఓవర్ ఎమోషన్ ఉంటుంది. అది తగ్గించుకుంటే ఈ రాశి వారికి అంతా బాగుంటుంది.

ప్రకటనలు

06

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (7)

సింహ రాశి (Leo): జులై 23 నుంచి ఆగస్ట్ 22 మధ్య ఈ రాశి దిశగా సూర్యుడి గమనం ఉంటుంది. లియో అంటే సింహం. ఇది కూడా ఫైర్ లాంటిదే. అంటే ఈ రాశి వారు చెలరేగిపోతారు. బాగా కష్టపడతారు, తెలివైన వారు, ఆటలు బాగా ఆడతారు, వీళ్లకు ఈజీగా గుర్తింపు వస్తుంది. భారీ వ్యవహారాల్ని పర్ఫెక్టుగా చెయ్యడంలో వీరిది ఆస్కార్ రేంజ్. పోటీల్లో తిరుగుండదు. వీళ్లు ఎక్కడుంటే అక్కడ అంతా వీళ్ల చుట్టే ఆకర్షణ ఉంటుంది. వీళ్లు కాస్త హై రేంజ్‌లో అన్నీ ఉండాలని కోరుకుంటారు. అలా ఉండకపోతే ఇబ్బంది పడతారు. ఈ విషయంలో కంట్రోల్ ఉంచుకుంటే… సింహ రాశి వారు సింహమే.

ప్రకటనలు

07

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (8)

కన్య రాశి (Virgo): ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 22 మధ్య కన్యా రాశి గుండా సూర్య ప్రయాణం ఉంటుంది. కన్యా రాశి చిహ్నంలో యువతి లేదా చెలికత్తె ఉంటుంది. ఇది కూడా భూమి రాశిగా చెబుతారు. కన్య రాశి వారితో ఎవరు ఉన్నా… టైమే తెలీదు. వీళ్లు చాలా చురుగ్గా ఉంటారు. వీళ్లు సమస్యలను బాగా పరిష్కరించగలరు. కొత్తగా ఆలోచించగలరు. తెలివితో అద్భుతంగా ఆకట్టుకోగలరు. ఏం చేసినా చక్కగా చేస్తారు. ఏకాగ్రత బాగా ఉంటుంది. దెబ్బతిన్న సంబంధాల్ని ఇట్టే కలిపేస్తారు. ఐతే… అతి చురుకుదనమే వీరికి సమస్య. వీళ్లు చాలా బిజీ అయిపోతూ… వీళ్ల గురించి ఆలోచించే వారి గురించి వీళ్లు ఆలోచించలేరు. ఈ విషయంలో తీరు మార్చుకుంటే అంతా బాగుంటుంది.

ప్రకటనలు

08

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (9)

తుల రాశి (Libra): సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 వరకు తుల రాశిలో సూర్యుడు ప్రయాణిస్తాడు. పేరుకు తగ్గట్టుగా ఈ రాశి చిహ్నం తుల (balance). దీన్ని గాలి గుర్తుగా చెబుతారు. ఈ రాశి వారు విశ్లేషణలు (analysis) బాగా చేస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో తిరుగు ఉండదు. సరైన జడ్జిమెంట్ ఇస్తారు. ప్రతీదీ పర్ఫెక్టుగా ఉండేలా చూస్తారు. గొడవల్ని వీరు ఈజీగా పరిష్కరిస్తారు. ప్రతీదీ కరెక్టుగా, బ్యాలెన్స్‌తో ఉండేలా చేసుకుంటారు. మానవ సంబంధాలను బాగా సెట్ చేసుకుంటారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఐతే… వీళ్లు చాలా విషయాల్లో బెస్ట్ రిజల్ట్స్ పొందలేరు. ఈ విషయంలో బ్యాలెన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.

ప్రకటనలు

09

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (10)

వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశిలో అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 మధ్య సూర్యుడి ప్రయాణం ఉంటుంది. ఈ రాశి చిహ్నం తేలు. ఇదివరకు ఇదే రాశికి గద్ద, పాము ఉండేది. ఇది కూడా కర్కాటక రాశిలాగే నీటి రాశి. ఈ రాశి వారు బాగా కష్టపడతారు. ఎలాంటి పరిస్థితులనైనా బాగా డీల్ చెయ్యగలరు. కష్టాల్లో ఉన్నవారికి వీరు తోడుగా ఉంటారు. వివాహ సంబంధాలను బాగా మెయింటేన్ చేస్తారు. ఐతే… వీళ్లు అతిగా ఎమోషన్ అవ్వరు. పైగా వీరిని ఎవరైనా ఇబ్బంది పెడితే… కచ్చితంగా బుద్ధి చెబుతారు. అంతా బాగానే ఉన్నా వీరు సరదాగా ఉండరు. కాస్త కఠినంగా ఉంటారు. పైకి కఠిన హృదయుల్లా కనిపిస్తారు. ఈ వ్యవహారం మార్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

ప్రకటనలు

10

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (11)

ధనస్సు రాశి (Sagittarius): నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 మధ్య పుట్టేవారికి ధనస్సు రాశి ఉంటుంది. ఈ రాశి చిహ్నం ఆశ్చర్యంగా ఉంటుంది సగం మనిషి, సగం గుర్రం ఉంటుంది. రూపాంతర (mutated) అగ్ని రాశి ఇది. వీరికి నాలెడ్జి ఎక్కువ. ఏది నమ్ముతారో అదే పాటిస్తారు. ప్రపంచమంతా చుట్టేయడానికి వెనకాడరు. ప్రయోగాలు బాగా చెయ్యగలరు. స్కిల్స్ బాగా వచ్చు. ఇతరులకు కూడా బాగా నేర్పగలరు. ఐతే… వీళ్లు తమ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే దానిపై ప్లానింగ్‌తో ఉండరు. అలాగే ఎప్పటికప్పుడు గతాన్ని వదిలేస్తారు. ఈ రెండింటిపై ఆసక్తి పెంచుకుంటే… ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది.

ప్రకటనలు

11

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (12)

మకర రాశి (Capricorn): డిసెంబర్ 22 నుంచి జనవరి 19 మధ్య ఈ రాశిలో సూర్యప్రయాణం ఉంటుంది. ఈ రాశి చిహ్నం మేక. పాత చిహ్నంలో సగం మేక, సగం చేప ఉండేది. ఇది కూడా భూమి రాశి. ఈ రాశి వారు బాధ్యతలు నెత్తిన పెట్టుకుటారు. పెద్ద లక్ష్యాలు ఉంటాయి. పనిచేస్తారు… ఫలితం ఆశిస్తారు. ప్రమాణాలు పాటించడంలో వీరికి తిరుగుండదు. ప్రతీదీ పక్కాగా లెక్కలేయగలరు. ఏదైనా సాధించగలరు. మంచి ఫలితాలు వచ్చేదాకా వదలరు. ఐతే… వీళ్లు కఠినంగా ఉంటారు. కాస్త జాలి గుణం పెంచుకుంటే… ఇక అంతా వీరిని ఇష్టపడతారు.

ప్రకటనలు

12

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (13)

కుంభ రాశి (Aquarius): జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 మధ్య కుంభ రాశిలో సూర్యుడు ఉంటాడు. ఈ రాశి చిహ్నంలో ఓ మహిళ కుంభంతో నీరు పోస్తూ ఉంటుంది. అందువల్ల చాలా మంది ఇది కూడా నీటి రాశి అని అనుకుంటారు. కానీ కాదు. ఇది అగ్ని రాశి. చెలరేగిపోతుంది. ఈ రాశి వారు బాగా కష్టపడి పనిచేస్తారు. తమ వారి కోసం ఎదురొడ్డి పోరాడుతారు. ప్రపంచానికి సరికొత్త ఐడియాలు ఇస్తారు. గ్రూపులుగా ప్రజలను ఉంచగలరు. సమాజాన్ని ఉద్ధరిస్తారు. ప్రతి విషయంలో ది బెస్ట్ ఇస్తారు. భవిష్యత్తను బాగా అంచనా వేస్తారు. అంతా బాగానే ఉన్నా వీరిలో ధైర్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల సాహసాలు చెయ్యడం కష్టమవుతుంది. ధైర్యం కాస్త పెంచుకుంటే… ఇక సంచలనమే.

ప్రకటనలు

13

12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (14)

మీన రాశి (Pisces): ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 మధ్య మీనరాశి గుండా సూర్యుడు వెళ్తాడు. ఈ రాశి చిహ్నంలో రెండు చేపలు ఒకదాన్ని ఒకటి చేజింగ్ చేసుకుంటున్నట్లు ఉంటాయి. ఇది కూడా మిథున రాశి లాంటిదే కాకపోతే ఇది నీటి రాశి. ఏమోషన్ అన్ని రాశుల కంటే అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా సెన్సిటివ్, మృదు స్వభావం కలిగి ఉంటారు. ఐతే… పైకి ఒకలా లోపల మరోలా ఉంటారు. కారణం రెండు మనస్తత్వాలు. వీరు పైకి సైలెంట్‌గా అమాయకంగా ఉంటూ… లోపల మనసులో కలలు కంటారు, ఊహల్లో ఉంటారు. సొంతంగా ఏవేవో నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే… ఇక వీరు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. వీరితో డీలింగ్ చేసే వారు లోతుగా అర్థం చేసుకోవాలి. మరీ ఇంత ఎమోషనల్‌గా ఉండటమే వీరి మైనస్ పాయింట్. కాస్త కఠిన హృదయాన్ని అలవర్చుకోవాలి.

ప్రకటనలు

  • First Published :
12 Zodiac Signs: రాశులకు అర్థాలేంటి.. ఏ రాశి వారు ఎలా ఉంటారు.. లక్షణాలేంటి? (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Stevie Stamm

Last Updated:

Views: 6676

Rating: 5 / 5 (60 voted)

Reviews: 91% of readers found this page helpful

Author information

Name: Stevie Stamm

Birthday: 1996-06-22

Address: Apt. 419 4200 Sipes Estate, East Delmerview, WY 05617

Phone: +342332224300

Job: Future Advertising Analyst

Hobby: Leather crafting, Puzzles, Leather crafting, scrapbook, Urban exploration, Cabaret, Skateboarding

Introduction: My name is Stevie Stamm, I am a colorful, sparkling, splendid, vast, open, hilarious, tender person who loves writing and wants to share my knowledge and understanding with you.